60th anniversary of parliament debate don t disrupt house appeals pm

60th anniversary of Parliament: Debate, don’t disrupt House, appeals PM,Pratibha Patil,Pranab Mukherjee,Manmohan Singh,Lok Sabha,LK Advani,60th anniversary of Parliament,60 years of Parliament

60th anniversary of Parliament: Debate, don’t disrupt House, appeals PM

PM.gif

Posted: 05/14/2012 11:50 AM IST
60th anniversary of parliament debate don t disrupt house appeals pm

60th anniversary of Parliament: Debate, don’t disrupt House, appeals PM

పార్లమెంటు మొట్ట మొదటి సమావేశం జరిగి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక సమావేశాన్ని ఆయన రాజ్యసభలో ప్రారంభించారు. గత ఇరవై ఒక్కేళ్లుగా మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.  ప్రభుత్వాల ఏర్పాటు, లేదా పదవీచ్యుతి చేయటంలోఎట్టిపాత్ర లేని రాజ్యసభ ఏర్పాటు అనవసరమని వాదించిన వారికి కనువిప్పు కలిగించేవిధంగా రాజ్యసభ గత ఆరు దశాబ్దాలుగా అనేక కీలక నిర్ణయాల రూపకల్పనలో గణనీయమైన పాత్ర పోషించిందని ప్రధాని మన్‌మోహన్ సింగ్ చెప్పారు. తొందరపాటు నిర్ణయాలతో రూపొందించిన చట్టాలు హడావిడిగా కార్యరూపం ధరించకుండా నివారించటంలో రాజ్యసభ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పడు ప్రతిపక్ష నాయకునిగా ఆయన వ్యవహరించారు. 2004 నుంచి ఆయన అస్సోం నుంచి రాజ్యసభకు ఎన్నికై ప్రధానిగానేకాక సభానాయకునిగా వ్యవహరిస్తున్నారు. 21 ఏళ్ల అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు రెండు సభలు అవసరమా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పే విధంగా వ్యవహరించవలసిన బాధ్యత మీదేనని ఆనాడు పెద్దల సభకు తొలి అధ్యక్షుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణనన్ అన్నారని ప్రధాని గుర్తుచేశారు. రాజ్యసభ ఆయన ఇచ్చిన సలహాను విజయవంతం చేసిందని ప్రధాని ప్రశంసించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Small tummy size
Dead body found in water tank of vijayawada durga temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles